
సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. హీరో కృష్ణ భార్య , హీరో మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి అనారోగ్యంతో ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ లో మరణించారు. తల్లి మరణంతో మహేష్ బాబు తీవ్ర దుఃఖసాగరంలో మునిగారు. కొన్నాళ్ల క్రితమే అన్న రమేష్ బాబు అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధ నుండి ఇంకా కోలుకోకముందే తల్లి మరణించడంతో మహేష్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
మహేష్ బాబుకు తల్లి ఇందిర అంటే చాలా చాలా ఇష్టం. ఆమెను తన సినిమా ఫంక్షన్ లకు తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేసారు మొదట్లో. అయితే ఆమెకు ఫంక్షన్లలో వచ్చే ఇష్టం లేకపోవడంతో ఇందిరాదేవి గురించి పెద్దగా జనాలకు తెలియలేదు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి ఈరోజు మరణించడంతో పద్మాలయా స్టూడియోస్ లో కొద్దిసేపు ఆమె పార్దీవ దేహాన్ని అభిమానుల సందర్శరార్థం ఉంచి ఈరోజునే అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు సమాచారం.