సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాడు. ఇప్పటికే పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన మహేష్ తాజాగా కాఫీ బిజినెస్ లోకి కూడా రంగప్రవేశం చేసాడు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోగల TRS భవన్ కు దగ్గరలో ఓ భారీ కాఫీ షాప్ రెస్టారెంట్ ను ఈరోజు ప్రారంభించనున్నారు.
మినర్వా కాఫీ షాప్ హైదరాబాద్ మహానగరంలో చాలా ఫేమస్ దాంతో వాళ్ళతో కలిసి ఈ బిజినెస్ లోకి దిగాడు మహేష్ బాబు. అయితే పేరుకు మహేష్ బాబు అయినప్పటికీ వ్యవహారాలు మొత్తం చూసేది మాత్రం మహేష్ భార్య నమ్రత అనే విషయం తెలిసిందే. పైగా ఏషియన్ సునీల్ నారంగ్ తో కలిసి ఇందులో పెట్టుబడులు పెట్టారు మహేష్ – నమ్రత .
ఏషియన్ సునీల్ తో కలిసి ఎందుకు పెట్టారంటే …….. గచ్చిబౌలి లోని AMB మాల్ పెట్టడానికి ఏషియన్ సునీల్ కారకులు. మహేష్ బాబు వద్ద భారీగా డబ్బులు ఉన్నాయి. అయితే వాటిని రియల్ ఎస్టేట్ రంగంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టింది నమ్రత. అయితే మహేష్ బాబుకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ రావడం …… ఖర్చులు మాత్రం నామమాత్రంగానే ఉండటంతో ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న నమ్రతకు సునీల్ నారంగ్ AMB లో పెట్టుబడులు పెట్టాలని సూచించడం …..అది భారీగా సక్సెస్ కావడంతో మరోసారి సునీల్ నారంగ్ తో కలిసి కాఫీ షాప్ బిజినెస్ ప్రారంభించారు.