
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి అలాగే ఇద్దరు కొడుకులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లాడు. నెల రోజుల పాటు కుటుంబంతో సరదాగా గడపనున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ ఖాళీగానే ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆలస్యం అవుతోంది. ఆ సినిమా పూర్తయ్యాకే మరో సినిమాలో అడుగు పెట్టనున్నాడు ఎన్టీఆర్.
కొరటాల శివ సినిమా అసలు ఈపాటికి పూర్తి కావాలి. కానీ ఆచార్య ఇచ్చిన షాక్ తో ఈ సినిమా ఆలస్యం అవుతోంది. స్క్రిప్ట్ పక్కాగా వచ్చిన తరువాత మాత్రమే సెట్స్ మీదకు వెళ్లాలని భావిస్తున్నాడు ఎన్టీఆర్. అందుకే ఆ సినిమా ఆలస్యం అవుతోంది.
ఈలోగా కుటుంబంతో కలిసి అమెరికా పర్యటన చేస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. నెల రోజుల పాటు భార్యా పిల్లలతో కలిసి విహారయాత్ర చేయనున్నాడు. అంటే సంక్రాంతి ముందు ఇండియాకు వస్తాడు. న్యూ ఇయర్ వేడుకలు అమెరికాలోనే జరుపుకోనున్నాడు ఎన్టీఆర్.