
ఈనెల 18 న ఇండియా – న్యూజిలాండ్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ ఉండటంతో నిన్న హైదరాబాద్ చేరుకుంది ఇండియన్ టీమ్. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో దిగారు భారత క్రికెటర్లు. ఇక పార్క్ హయత్ హోటల్ అంటే సినిమా వాళ్లకు కూడా కేరాఫ్ అడ్రస్ లాంటింది పైగా నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి హోటల్ కావడంతో అక్కడ కొన్ని గదులు ప్రత్యేకించి సినిమా స్టార్ లకు కేటాయించి ఉంటాయి.

ఇక స్టార్ క్రికెటర్లు వచ్చారన్న విషయం స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు తెలియడంతో వాళ్ళను కలిసాడు. అంతేకాదు వాళ్లకు విందు కూడా ఇచ్చాడు ఎన్టీఆర్. సూర్యకుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్ , చాహల్ , శుభ్ మన్ గిల్ , శార్దూల్ ఠాగూర్ తదితరులు ఎన్టీఆర్ ను కలిసిన వాళ్లలో ఉన్నారు. ఇక ఈరోజు ఉప్పల్ స్టేడియం లో ప్రాక్టీస్ చేయనున్నారు. రేపు అంటే జనవరి 18 న భారత్ – న్యూజిలాండ్ ల మధ్య రసవత్తరంగా మ్యాచ్ జరుగనుంది.