
ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ పై డార్లింగ్ ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రం నుండి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో అసలు ఈ సినిమా జూన్ లో విడుదల అవుతుందా ? లేదా ? అని తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్. డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ……… ఆదిపురుష్ టీజర్ సృష్టించిన కలకలమే !
ఆదిపురుష్ టీజర్ అప్పట్లో విపరీతమైన ట్రోలింగ్ కు గురైంది. ఇది బొమ్మల సినిమాలాగా ఉంది కానీ ప్రభాస్ రేంజ్ సినిమా కాదని దర్శకుడు ఓం రౌత్ పై మండిపడ్డారు. ఆ దాడి ఎంతగా అంటే దర్శకుడు కనబడితే కొట్టడమే మిగిలి ఉంది అంతగా ఆగ్రహించారు. దాంతో భయపడినపోయిన ఓం రౌత్ సినిమాను వాయిదా వేయడమే కాకుండా కొన్ని రీషూట్ లు చేసాడు కూడా.
ఇక ఈ ఏడాది జూన్ 16 న ఆదిపురుష్ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. కట్ చేస్తే ఉగాది వచ్చింది కానీ ఆదిపురుష్ నుండి ఎలాంటి అప్ డేట్ లేదు దాంతో మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెల అయిపోతోంది. ప్రభాస్ సినిమా అంటే కనీసం రెండు నెలల ముందు నుండే ప్రమోషన్ మొదలు పెట్టాలి. మరి ఈనెల 30 న శ్రీరామనవమి కావడంతో ఆ సందర్భాంగానైనా ఆదిపురుష్ అప్ డేట్ ఉంటుందా ? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






