డార్లింగ్ ప్రభాస్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు దాంతో షూటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. మాములు జ్వరమేగా షూటింగ్ లో పాల్గొనొచ్చులే అని అనుకున్నాడట కానీ లొకేషన్ కు వెళ్లే సమయంలో తీవ్ర అస్వస్థతకు లోనవ్వడంతో షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వైజాగ్ నుండి హైదరాబాద్ చేరుకున్నాడు ప్రభాస్.
ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే తగిన వైద్య పరీక్షలు చేయించుకున్నాడట. డాక్టర్ల సలహా మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ప్రభాస్ ఇటీవల వరుసగా షూటింగ్స్ చేస్తున్నాడు. ఒకవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”సలార్ ” , అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ” ప్రాజెక్ట్ – K ” చిత్రంతో పాటుగా మారుతి దర్శకత్వంలో ఓ హర్రర్ కామెడీ చిత్రం చేస్తున్నాడు.
ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఉండటంతో పాటుగా వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల కూడా ఇబ్బందికి గురయ్యాడని తెలుస్తోంది. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో షూటింగ్ క్యాన్సిల్ అయ్యాయి. ప్రభాస్ మళ్ళీ కోలుకున్న తర్వాత మారుతి సినిమాలో జాయిన్ కానున్నాడు.