
హీరో రాంచరణ్ లేడీ ఫ్యాన్స్ ఇద్దరు జుట్టు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. విచిత్రం ఏంటంటే నడిరోడ్డు మీద ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటుంటే అక్కడున్న కాలేజ్ స్టూడెంట్స్ అందరూ బొమ్మలా చూస్తుండి పోయారు తప్ప విడిపించడానికి ప్రయత్నించలేదు. అలాగే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఆపడానికి ప్రయత్నం చేయలేదు. చివరకు అబ్బాయిలు ముందుకు వచ్చి ఆ ఇద్దరు అమ్మాయిలను ఆపారు. దాంతో గొడవ సద్దుమణిగింది.
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అయితే ఏ ఊరు అన్నది మాత్రం తెలియలేదు. ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా హీరో రాంచరణ్ అభిమానులు కావడం విశేషం. ఏ విషయంలో గొడవ జరిగింది అనేది తెలియాల్సి ఉంది కాని గొడవ జరుగుతున్న సమయంలో కొట్టుకోవడమే కాదు బూతులు కూడా తిట్టుకున్నారు. ఇక ఈ తతంగమంతా సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇంకేముంది ఆ వీడియో వైరల్ గా మారింది.






