మెగా పవర్ స్టార్ రాంచరణ్ మెగా అభిమానులను కలిసాడు. తనని అభిమానించే వాళ్ళ కోసం కొంత సమయం కేటాయించడంతో అభిమానులు పులకించిపోయారు. అలాగే తమ అభిమాన హీరోతో ఫోటోలు దిగారు……. ఆ జ్ఞాపకాలను తమ గుండెల్లో పదిలపరుచుకున్నారు మెగా అభిమానులు.
చరణ్ తన అభిమానులను హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లో కలిశారు. అభిమానుల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. తన కోసం ఎక్కడెక్కడినుండో వచ్చిన అభిమానులను ఆప్యాయంగా పలకరించాడు చరణ్. ప్రతీ ఒక్కరితో ఫోటోలు దిగాడు. అలాగే కొంతమంది అభిమానులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. చరణ్ అయ్యప్పస్వామి మాల ధరించిన విషయం తెలిసిందే.
ఒకవైపు షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు హైదరాబాద్ లో జరిగిన ఈ ఫార్ములా కార్ రేసింగ్ పోటీలలో పాల్గొన్నాడు. ఇక అదే జోష్ లో తన అభిమానులను కలిసాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో నటిస్తున్నాడు చరణ్. కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది ఆ చిత్రంలో. ఇటీవలే కియార అద్వానీ పెళ్లి చేసుకోగా చరణ్ తన యూనిట్ సబ్యులతో కలిసి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశాడు.