
హీరో శర్వానంద్ వివాహ నిశ్చితార్థం రక్షితా రెడ్డి తో ఘనంగా జరిగింది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన రక్షితా రెడ్డి మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు. కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. అయితే రక్షితా రెడ్డి ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా హీరో శర్వానంద్ కు పరిచయం కావడం …… ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల పెద్దలు ఈ పెళ్ళికి అంగీకరించారు. దాంతో జనవరి 26 న వివాహ నిశ్చితార్థం జరిగింది.
శర్వానంద్ – రక్షితారెడ్డి ఎంగేజ్ మెంట్ కు సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు అలాగే శర్వా బెస్ట్ ఫ్రెండ్స్ చరణ్ – ఉపాసన దంపతులు , రానా లతో పాటుగా పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి ఈ జంటకు పెళ్లి చేయనున్నారు. మొత్తానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ జాబితా నుండి శర్వానంద్ కు ప్రమోషన్ లభించిందన్న మాట.