JSW & Jaiswaraajya.tv సంస్థల అడ్వైజర్ జై యలమంచిలి UBlood app లాంటి అద్భుతమైన యాప్ ను ప్రజల కోసం రూపొందించడం సంతోషించతగ్గ విషయమని ప్రశంసలు కురిపించారు హీరో సుమన్. 80 – 90 వ దశకంలో స్టార్ హీరోగా తెలుగునాట సంచలనం సృష్టించిన హీరో సుమన్. విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకొని తెలుగు , తమిళ భాషల్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు సుమన్.
దాదాపుగా నెంబర్ వన్ పొజీషన్ లోకి వస్తున్న సమయంలో అనూహ్యంగా …… కుట్రపూరితంగా ఓ కేసులో ఇరుక్కొని జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. అయితే ప్రేక్షకుల ఆశీర్వాద బలం , అభిమానుల అండదండలు వెరసి సుమన్ నిర్దోషిగా బయటపడ్డారు. జైలులో ఉండే హీరోగా బందిపోటు , ఉగ్రనేత్రుడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి సత్తా చాటారు. నిర్దోషిగా బయటకు వచ్చాక వెల్లువలా వచ్చిన అవకాశాలతో మరోసారి సత్తా చాటారు సుమన్. ఇక ఇప్పుడేమో ప్రాధాన్యమున్న పాత్రలను పోషిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు.
తాజాగా యు బ్లడ్ యాప్ గురించి తెలుసుకున్న సుమన్ …… ఈ యాప్ ను రూపొందించిన డాక్టర్ జై యలమంచిలిని అభినందనలతో ముంచెత్తారు. రక్తం వల్లే ప్రాణాలు నిలబడుతున్నాయి ….. అలాంటి రక్తం కోసం అవసరమైన సమయాల్లో ఎక్కడెక్కడో వెతకాల్సి వస్తోంది. చాలాసార్లు అవసరమైన బ్లడ్ గ్రూప్ దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లకు యు బ్లడ్ యాప్ ఒక సంజీవని అని చెప్పొచ్చు. ఈ యాప్ లో తమ వివరాలను నమోదు చేసుకుంటే అవసరమైన బ్లడ్ గ్రూప్ వాళ్ళ సమగ్ర సమాచారం ఉంటుంది కాబట్టి తప్పకుండా చాలా మంచి యాప్ అని చెప్పొచ్చు. నిజంగా ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ జై యలమంచిలిని అభినందించాల్సిందేనన్నారు. ”రక్తదానం చేయండి – ప్రాణదాతలు కండి” అంటూ JSW & Jaiswaraajya.tv సంస్థల కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యువతకు సందేశం ఇచ్చారు సుమన్.