కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయం అభిమానులకు తెలియడంతో ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్నారు. అయితే దుమ్ము ధూళి వల్ల ఇబ్బందులు పడిన ఉపేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ కావడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
తాజాగా ఓ కన్నడ సినిమాలో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే ఆ సీన్స్ అంతా కూడా దుమ్ము , ధూళి లో చిత్రీకరిస్తుండటంతో అసలే డస్ట్ ఎలర్జీ ఉన్న ఉపేంద్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో హుటాహుటిన ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ఇలా అనారోగ్యానికి గురవ్వడానికి కారణం డస్ట్ ఎలర్జీ అని తేలడంతో దర్శక నిర్మాతలు పలు జాగ్రత్తలు తీసుకున్నారట.
ఉపేంద్ర కన్నడ హీరో అయినప్పటికీ దక్షిణ భారతదేశంలో పాపులర్ ఆర్టిస్ట్ అనే విషయం తెలిసిందే. 90 వ దశకంలోనే ఉపేంద్ర అనే చిత్రంతో ప్రభంజనం సృష్టించాడు ఉపేంద్ర. విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు.