ఒకప్పుడు తప్పకుండా పూరీ జగన్నాథ్ తో ఒక్క సినిమా అయినా చేయాల్సిందే అని భావించేవాళ్లు టాలీవుడ్ స్టార్ హీరోలు. ఎందుకంటే హీరో క్యారెక్టర్ చాలా డిఫరెంట్ యాటిట్యూడ్ తో ఉంటుంది కాబట్టి తప్పకుండా మనల్ని మనం కొత్తగా స్క్రీన్ మీద చూసుకోవచ్చు అని ఫీలయ్యవాళ్ళు హీరోలు. మన టాలీవుడ్ స్టార్ హీరోలు పోటీ పడ్డారు కూడా. అయితే అదంతా గతంలా మారింది ఇప్పుడు.
ఎందుకంటే ఇప్పుడు పూరీ జగన్నాథ్ పలువురు హీరోలతో సినిమా చేయాలని భావిస్తున్నాడు. కానీ ఇప్పుడు హీరోలంతా పూరీ జగన్నాథ్ అంటే భయపడుతున్నారు. స్టార్ హీరోలు ఎలాగూ డేట్స్ ఇవ్వడం లేదు కనీసం సెకండ్ గ్రేడ్ హీరోలయినా దొరుకుతారా ? అంటే అదీ లేదు సెకండ్ గ్రేడ్ హీరోలు కూడా పూరీ జగన్నాథ్ కు నో చెబుతున్నారట.
దాంతో పూరీ జగన్నాథ్ కు మిగిలిన ఏకైక ఆప్షన్ పూరీ ఆకాష్ మాత్రమే ! అవును పూరీ జగన్నాథ్ కొడుకు పూరీ ఆకాష్ కూడా హీరోగా తనని తాను నిరూపించుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. దాంతో తండ్రీ కొడుకులు కలిసి ఓ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టి తమలో ఇంకా సత్తా తగ్గలేదు అని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకు బండ్ల గణేష్ పూనుకుంటున్నట్లుగా సమాచారం. లైగర్ దెబ్బతో ఒక్కసారిగా పూరీ జగన్నాథ్ జీవితం తలకిందులు అయ్యింది.