అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన విషయం తెలిసిందే. హీరో నాని ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ 2 చిత్రానికి ఓవర్సీస్ లో షోలు పడ్డాయి.
దాంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ రివ్యూలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. ఇంతకీ ట్విట్టర్ రివ్యూ ప్రకారం సినిమా ఎలా ఉందో తెలుసా…….. హిట్ 2 పక్కాగా హిట్టు అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
హిట్ చిత్రంలో హీరోగా విశ్వక్ సేన్ నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో హిట్ 2 సెట్స్ పైకి వెళ్ళింది. అయితే హిట్ 2 లో విశ్వక్ సేన్ నటించలేదు. తనకు ఉన్న కమిట్ మెంట్స్ వల్ల హిట్ 2 వాయిదా వేయమని కోరాడు అందుకు శైలేష్ కొలను , నాని ఒప్పుకోలేదు . దాంతో విశ్వక్ సేన్ హిట్ 2 నుండి తప్పుకున్నాడు.
ఇంకేముంది అతడి స్థానంలో అడవి శేష్ ను హీరోగా పెట్టి హిట్ 2 చిత్రం చేసాడు. టీజర్ , ట్రైలర్ పై అద్భుతమైన స్పందన లభించింది. దానికి తోడు గతకొంత కాలంగా అడవి శేష్ నటిస్తున్న చిత్రాలన్నీ మంచి విజయం సాధిస్తుండటంతో హిట్ 2 పై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ట్విట్టర్ టాక్ చూస్తే బాగానే ఉంది. దాంతో నాని , అడవి శేష్ మంచి హిట్టు కొట్టినట్లే కనబడుతోంది.