
ఈరోజు విడుదలైన హిట్ 2 కు సూపర్ హిట్ టాక్ రావడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఆ చిత్ర బృందం. జూబ్లీహిల్స్ లోని నాని కార్యాలయంలో ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. అన్ని చోట్లా టాక్ బాగుందని , అలాగే 80 పర్సెంట్ నుండి చాలా చోట్లా హౌజ్ ఫుల్స్ పడ్డాయని పెద్ద సక్సెస్ కు ఇదే నిదర్శనం అంటూ సంతోషం వ్యక్తం చేసారు చిత్ర బృందం.
హీరో అడవి శేష్ , హీరో నాని అలాగే మిగతా చిత్ర బృందం షాంపెయిన్ పొంగించి మరీ తమ ఆనందాన్ని పంచుకున్నారు. నాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే హిట్ అని తీస్తే అది హిట్ అయ్యింది. దానికి సీక్వెల్ గా హిట్ 2 తీస్తే దీనికి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. అంతకుమించిన హిట్ కొట్టింది. దాంతో చాలా సంతోషంగా ఉన్నాడు.
హిట్ , హిట్ 2 రెండు కూడా సూపర్ హిట్స్ కావడంతో హిట్ 3 కూడా తీయాలని డిసైడ్ అయ్యాడు నాని . హిట్ లో విశ్వక్ సేన్ హీరో కాగా హిట్ 2 లో అడవి శేష్ హీరో …….. ఇక హిట్ 3 లో హీరో ఎవరో తెలుసా …….. తమిళ స్టార్ విజయ్ సేతుపతి. అవును ఈ విషయాన్ని హిట్ 2 చిత్రంలోనే రివీల్ చేసారు దర్శక నిర్మాతలు.