అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. డిసెంబర్ 2 న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో రాబోయే రోజుల్లో మరో 10 కోట్ల వసూళ్లను కలిపి మొత్తంగా 50 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 25 కోట్ల వసూళ్లను సాధించింది హిట్ 2. ఇక ఓవర్ సీస్ లో 1 మిలియన్ డాలర్లను దాటేసింది.
విశ్వక్ సేన్ హీరోగా హిట్ చిత్రాన్ని నిర్మించాడు హీరో నాని. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా హిట్ 2 చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి కూడా శైలేష్ కొలను దర్శకుడు. అయితే హీరో మాత్రం మారాడు. విశ్వక్ సేన్ బిజీగా ఉండటంతో అతడి కోసం వెయిట్ చేయకుండా అడవి శేష్ ను సంప్రదించారు.
అడవి శేష్ కు కూడా కథ నచ్చడంతో మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాడు. కట్ చేస్తే ……. సినిమా సూపర్ హిట్ కావడంతో చాల సంతోషంగా ఉన్నారు ఆ చిత్ర బృందం. ఇక హిట్ 3 కూడా తీయనున్నారు …… అయితే హిట్ 3 లో నాని హీరోగా నటించనున్నాడు. వరుస విజయాలు సాధిస్తున్న అడవి శేష్ పై అభినందనల వర్షం కురుస్తోంది.