నవంబర్ 18 న విడుదలైన మసూద అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా లో ఈనెల 16 న లేదంటే 23 న స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతోందట. త్వరలోనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. సాయి కిరణ్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నిర్మించాడు.
సంగీత , తిరువీర్ , కావ్య కళ్యాణ్ రామ్ , శుభలేఖ సుధాకర్ తదితరులు నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. థియేటర్ లలో మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రాన్ని స్టార్ మా ఛానల్ శాటిలైట్ హక్కులు తీసుకోగా ఆహా ఓటీటీ రైట్స్ తీసుకుంది. మంచి ఫ్యాన్సీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాత రాహుల్ యాదవ్ ఆహాకు ఇచ్చేశాడట.
హర్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం పై నిర్మాత రాహుల్ యాదవ్ నమ్మకం పెట్టుకున్నాడు. అందుకే కాస్త ఆలస్యమైనా థియేటర్ లలోనే విడుదల చేసాడు. ఇక థియేటర్ లలో మంచి వసూళ్లు రావడంతో సంతోషంగా ఉన్నాడు. ఇక ఆహాలో స్ట్రీమింగ్ కి సిద్ధం కావడంతో ఇక్కడ ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి. ఇటీవల కాలంలో థియేటర్ లలో సినిమాలు తక్కువగా చూస్తున్నారు కాబట్టి ఈ సినిమాను థియేటర్ లో చూడని వాళ్ళు ఓటీటీలో చూడటం ఖాయం.