నాని హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ” దసరా ”. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30 న పాన్ ఇండియా చిత్రం గా విడుదల కానుంది. ఇటీవల కాలంలో పాన్ ఇండియా చిత్రాలు ఎక్కువయ్యాయి. దాంతో ఈసినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించారు. నాని సినిమాకు 30 కోట్లు పెట్టడమే ఎక్కువ కానీ ఈ సినిమాకు మాత్రం డబుల్ బడ్జెట్ పెట్టారు అంటే ….. మొత్తంగా 60 కోట్ల బడ్జెట్ అయ్యిందట.
నానికి 60 కోట్ల బడ్జెట్ అంటే చాలా చాలా ఎక్కువ. నాని సినిమా బ్లాక్ బస్టర్ కొడితేనే అది రికవరీ అవుతుంది. ఈ విషయం తెలిసి కూడా భారీ బడ్జెట్ పెట్టారు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ భారీగా జరగడం విశేషం. ఎందుకంటే నాని లుక్ , ధూమ్ ధామ్ అనే పాట , టీజర్ వెరసి నాని దసరా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ అంచనాలకు తగ్గట్లుగానే 70 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా భారీ హిట్ కొడితే నాని రేంజ్ కూడా పూర్తిగా మారిపోతుంది. నాని కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుంది అన్నది మార్చి 30 న తేలనుంది. కీర్తి సురేష్ నాని సరసన నటించింది ఈ చిత్రంలో. నాని – కీర్తి సురేష్ లది హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇంతకుముందు మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమాలో కలిసి నటించారు.