నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో ” అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 ”. మొదటి సీజన్ రికార్డుల మోత మోగించింది. దాంతో రెండో సీజన్ కూడా చేసారు. ఇక ఇప్పుడు రెండో సీజన్ కూడా పూర్తి కావచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈ సీజన్ ముగియనుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయగా సంచలనం సృష్టిస్తోంది ఆ ఎపిసోడ్. అయితే పవన్ కళ్యాణ్ తో చేసిన ఇంటర్వ్యూ ను రెండు భాగాలుగా చేసారు.
మొదటి ఎపిసోడ్ ఫిబ్రవరి 3 న స్ట్రీమింగ్ కు రాగా ఫిబ్రవరి 10 న రెండో ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. బాలయ్య అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానాలు అభిమానులను విశేషంగా అలరించాయి. దాంతో రెండో ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూడు పెళ్లిళ్ల గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు , రాజకీయాలు , సినిమాలు ఇలా అన్ని విషయాలను వెల్లడించనున్నాడు. ఇప్పటికే కొన్ని రివీల్ చేయగా మరికొన్ని వివరాలు రెండో ఎపిసోడ్ లో రానున్నాయి. మొత్తానికి అన్ స్టాపబుల్ 2 రికార్డుల మోత మోగిస్తోంది. భారీ వ్యూస్ తో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది అన్ స్టాపబుల్ 2.