
మేకింగ్ సమయంలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది బాలయ్య – పవన్ కళ్యాణ్ ల అన్ స్టాపబుల్ షో. నిన్న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్ స్టాపబుల్ 2 షో జరుగగా ఆ షోకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ షోలో పాల్గొనడానికి అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. పాస్ ల కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసారు కూడా. ఇక అన్నపూర్ణ పరిసర ప్రాంతాల్లో అయితే ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో వాళ్ళను కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడ్డారు పోలీసులు.
ఇక ఈ షోలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయట. పవన్ కళ్యాణ్ మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. అలాగే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ప్రస్తావన వచ్చిందని , అతడు కూడా కొద్దిసేపు షోలో కనిపిస్తాడని తెలుస్తోంది. అలాగే సినిమా , రాజకీయ రంగాల్లో పలు ప్రశ్నలు బాలయ్య సంధించగా పవన్ కళ్యాణ్ కూడా అదే స్థాయిలో సమాధానాలు ఇచ్చాడని తెలుస్తోంది.
ఇక ఈ షోలో జరిగిన కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ షో స్ట్రీమింగ్ కు వచ్చిన సమయంలో రికార్డుల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రారంభంలోనే ఇలా ప్రకంపనలు సృష్టిస్తుంటే ఇక స్ట్రీమింగ్ కు వచ్చిన తర్వాత మాత్రం దేశ వ్యాప్తంగా మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.