
తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం ” Hanu – Man ”. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. తేజ సజ్జ లుక్ అలాగే పోస్టర్స్ , విజువల్స్ చూస్తే తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. మేకర్స్ మాత్రమే కాదు ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
నిన్నటితో హను – మాన్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాను ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ వరల్డ్ చిత్రంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు , తమిళ్ , మలయాళ , కన్నడ , హిందీ ,స్పానిష్ , ఇంగ్లిష్ , కొరియన్ , చైనీస్ , జపాన్ తదితర భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం కంటే ఈ చిత్రానికి బజ్ ఎక్కువగా ఉండటం గమనార్హం. హను- మాన్ కు సంబందించిన విజువల్స్ చూసి ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అయితే ఆ స్థాయిలో ఆదిపురుష్ విజువల్స్ లేవు దాంతో ఆదిపురుష్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. హనుమంతుడి శక్తులు పొందిన హీరో అంజనాద్రి కోసం ఎలాంటి పోరాటం చేసాడు అనేది ఈ హను – మాన్ చిత్ర కథాంశం.






