
మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి కోకా పేట లేక్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోకాపేటలో చిరంజీవికి భూమి ఉంది. ఆ భూమిలో ఆచార్య సినిమా కోసం ధర్మస్థలి సెట్ వేశారు. ఆచార్య షూటింగ్ అయిపోయింది అలాగే రిలీజ్ అయి ప్లాప్ కూడా అయ్యింది.
అయితే ఆచార్య కోసం వేసిన సెట్ ను అలాగే ఉంచారు. ఆ సెట్ లో అడపా దడపా షూటింగ్ లు కూడా జరుగుతున్నాయి. ఇక నిన్న రాత్రి ధర్మస్థలి సెట్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అసలే ఎండలు కూడా ఎక్కువ అవుతుండటంతో మంటలు త్వరగా అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో వెంటనే స్పందించిన చుట్టుపక్కల ప్రజలు ఫైర్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా మంటలను అదుపు చేయడానికి ఫైర్ ఇంజన్లు వచ్చాయి.
అగ్ని ప్రమాదం సంభవించడంతో సెట్ మొత్తం కాలిపోయింది. ఇంకా విలువైన వస్తువులు ఏమైనా కాలిపోయాయా ? నష్టం ఏ స్థాయిలో జరిగింది అన్నది తేలాల్సి ఉంది. అయితే సకాలంలో ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో భారీ ప్రమాదం తప్పింది. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నాడు. చరణ్ అమెరికాలో ఉన్నాడు.