
నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం ” వీర సింహా రెడ్డి ”. ఈరోజు ఈ చిత్రం నుండి ” జై బాలయ్య ” అనే ప్రమోషనల్ సాంగ్ విడుదల చేసారు. తమన్ సంగీతం అందించిన ఈ పాట మాస్ లో ఒక ఊపు ఊపుతోంది. జై బాలయ్య …. జై బాలయ్యా అంటూ సాగే ఈ పాట పై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఇంతకీ ఈ విమర్శలు ఏంటో తెలుసా ……. ఒసేయ్ ! రాములమ్మ చిత్రంలో ” ఒసేయ్ రాములమ్మా ” అనే టైటిల్ సాంగ్ లాగే ఉంది.
దాంతో నెటిజన్లు ఆ పాటని ఈ పాటతో పోల్చుతూ కట్ చేసారు. అంతేకాదు రెండు బిట్ లను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసున్నారు కూడా. ఇంకేముంది అది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ విమర్శల సంగతి ఎలా ఉన్నప్పటికీ జై బాలయ్య అనే పాట మాత్రం వైరల్ గా మారింది. మాస్ ప్రేక్షకులను అలాగే నందమూరి అభిమానులను విశేషంగా అలరిస్తోంది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2023 లో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. బాలయ్య తో శృతి హాసన్ రొమాన్స్ ఎలా ఉంటుందో తెరమీద చూడాల్సిందే. ఇక విలన్ గా కన్నడ హీరో దునియా విజయ్ నటిస్తుండగా మరో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోంది.