27.9 C
India
Monday, October 14, 2024
More

    సినీ, రాజకీయ అతిరదుల సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ అయిన సందేశాత్మక చిత్రం “అవసరానికో అబద్దం”

    Date:

    In the presence of cine and political elites, the informative film "Avasraniko Abaddam" was launched in a grand manner.
    In the presence of cine and political elites, the informative film “Avasraniko Abaddam” was launched in a grand manner.

    మనిషి జీవితంలో నిజానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అబద్దానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని చెప్పే సందేశాత్మక చిత్రమే “అవసరానికో అబద్దం“. శ్రీమతి ఝాన్సీ, శ్రీ కృష్ణమూర్తి సమర్పణలో గ్లోబల్ ఎంపవర్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై త్రిగున్, రుబాల్ షేక్ రావత్ జంటగా ఆయాన్ బొమ్మాళి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ జగదీష్ యలమంచిలి నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియోలో వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, నిర్మాత దిల్ రాజు, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సురేష్ బాబు, హౌసింగ్ కార్పొరేషన్ దామోదర్ లు చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన  ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాత సురేష్ బాబు గారు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.

    చిత్ర దర్శకుడు ఆయాన్ బొమ్మాళి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో అబద్ధం అనేదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎంతగా అంటే చిన్నప్పుడు గోరుముద్దలు తినకపోతే బూచోడు ఎత్తుకు పోతాడు అని అమ్మ చెప్పే అబద్దం నుండి,మనం చనిపోయేముందు మనం బెడ్ మీద ఉన్నప్పుడు కూడా డాక్టర్ వచ్చి నీకేం కాదని చెప్పే దైర్యం వరకు మనిషి జీవితంలో అబద్దానికి చాలా ఇంపార్టెంట్స్ ఉందని చెప్పే సందేశాత్మక చిత్రమే “అవసరానికో అబద్దం”.అలాగే మహాభారతం లో శ్రీ కృష్ణుడు కొన్ని సందర్భాల్లో అబద్దం ఆడవచ్చు అని చెప్పాడు. దానిని ఆదర్శంగా తీసుకొని కమర్శియల్ వేలో సినిమాటిక్ గా సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఐడియాతో చేసిన కథ ఇది.ధర్మం కాపాడాలి అంటే ధర్మ రాజు తోనే అబద్ధం ఆడించాలనే స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరోది. మణిశర్మ గారు మా సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథతో చేస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారికీ కచ్చితంగా నచ్చుతుంది. అన్నారు.

    నిర్మాత డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి మాట్లాడుతూ..
    మా సినిమాని బ్లెస్స్ చేయడానికి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి సురేష్ దామోదరప్రసాద్ గారికి దిల్ రాజు గారికి, సురేష్ బాబు గారికి మా ధన్యవాదాలు. తెలుగు ఇండస్ట్రీ కి సీనియర్ ఎన్టీఆర్,ఏఎన్నార్ రెండు కళ్ళు వారు చేసిన కృషి వల్లే ఈ రోజు చిత్రసీమ ఇంత డెవలప్ అయ్యింది. సినిమా అంటే నాకు చాలా ఇష్టం.ఇదే సినిమా ఇండస్ట్రీలో నేను పెరిగిన వాణ్ని. ఏ టెంపుల్ కు వెళ్లినా, చర్చి కి వెళ్లినా మసీద్ కు వెళ్లినా అందరూ ధర్మో రక్షిత రక్షితః అంటాము. ధర్మాన్ని గెలిపించాలి అనే ఒక ఉద్దేశంతో మేము చేసిన ఒక మంచి ప్రయత్నం “అవసరానికో అబద్ధం”. ఈ సినిమాకి నాంది పలికింది దర్శకుడు బొమ్మాళి. తను చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రేక్షకులకు కావలసిన అంశాలు అన్ని ఇందులో ఉంటాయి. సినిమాకు తగ్గట్టు నటీ, నటులు, టెక్నిషియన్స్ లభించార. మంచి కథతో వస్తున్న ఈ సినిమా అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

    చిత్ర హీరో త్రిగున్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు చాలా క్రాస్ జోనర్ సినిమాలు చెయ్యడం జరిగింది. అలాగే దర్శకుడు ఆయాన్ బొమ్మాళి చెప్పిన కథ చాలా డిఫరెంట్ గా అనిపించిడంతో ఈ సినిమా చేస్తున్నాను.మా గురువు గారు మణి శర్మగారు నాకు 2022 లో పదములే లేవు పిల్ల వంటి బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చాడు. మళ్ళీ తను ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సాంగ్ ఇస్తాడని కోరుకుంటున్నాను. మా నిర్మాత డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారికి సినిమా అంటే ప్యాషన్. మంచి కథను సెలెక్ట్ చేసుకోని తీస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు వారికి, దర్శకులు బొమ్మాళి కి నా ధన్యవాదములు అన్నారు.

    చిత్ర హీరోయిన్ రుబాల్ షేక్ రావత్ మాట్లాడుతూ..ఇలాంటి మంచి సినిమాలు చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములున్నారు.

    నటీ, నటులు

    త్రిగున్,రుబాల్ షేక్ రావత్ తదితరులు

    సాంకేతిక నిపుణులు
    బ్యానర్ : గ్లోబల్ ఎంపవర్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్
    నిర్మాత : డాక్టర్ జగదీష్ యలమంచిలి
    స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్, డైరెక్షన్ : ఆయాన్ బొమ్మాలి
    మ్యూజిక్ మణిశర్మ
    సినిమాటోగ్రాఫర్ ::సిహెచ్ మోహన్ చారి
    ఎడిటర్ : జానకిరామ్
    లిరిక్స్ : అనంతశ్రీరామ్
    ఆర్ట్ : హేమంత్ కుమార్ జి
    పి. ఆర్. ఓ : హరీష్, దినేష్.

    Share post:

    More like this
    Related

    Hyderabad Wrestler : దేశ ధనవంతుల జాబితాలో హైదరాబాద్ రెజ్లర్.. ఎంత సంపాదన అంటే?

    Hyderabad Wrestler : దేశంలో ఏటికేడాది ధనవంతుల జాబితా పెరుగుతుందని కొన్ని...

    Adimulam : ఆదిమూలం.. మరో వివాదం.. ఆడియో లీక్‌.. అందులో ఏముందంటే?

    Adimulam : తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ బహిష్కృత...

    Redbus : పండుగకు ఇంటికి వెళ్లలేకపోవడమే ‘రెడ్‌బస్’ పుట్టుకకు కారణం..

    Redbus : ‘యువర్ లైఫ్ ఈజ్ బిగ్ యూనివర్సిటీ’ ఈ కొటేషన్...

    breathalyzer : బ్రీత్ ఎనలైజర్ తో పరార్.. పరువు పోగొట్టుకున్న పోలీసులు..

    breathalyzer : మందు బాబులకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు భావిస్తుంటే.. పోలీసులను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    అవసరానికో అబద్ధం పాన్ ఇండియా ఫిల్మ్ ప్రారంభం

    Trigun హీరోగా రుబాల్ షేక్ రావత్ హీరోయిన్ గా అయాన్ బొమ్మాలి...