
ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2022 గా నిలిచారు సోనూ సూద్. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో భారతాన అభినవ దాన కర్ణుడు గా అవతరించారు సోనూ సూద్. కరోనా కష్టకాలంలో ఆయన అందించిన సేవలు చరిత్రలో
నిలిచిపోతాయంటే అతిశయోక్తి కాదు సుమా! అందుకే సోనూ సూద్ అందించిన సేవలకు గాను ఇండియన్ ఆఫ్ ద ఇయర్ 2022 అవార్డుతో సత్కరిస్తున్నారు.
యు బ్లడ్ యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు సోనూ సూద్. ఈరోజుల్లో రక్తం కోసం దాతలు ఎదురుచూసే పరిస్థితులు కోకొల్లలు. దాంతో అలాంటి ఇబ్బంది కరమైన పరిస్థితులకు చెక్ పెట్టాలనే గొప్ప సంకల్పంతో జై యలమంచిలి UBlood యాప్ ని రూపొందించారు. ఆ యాప్ నచ్చిన సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డ్ దక్కడంతో సోనూ సూద్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.