
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ” ప్రాజెక్ట్ – కె ”. తాజాగా ఈ చిత్రం నుండి ఓ మేకింగ్ వీడియో విడుదల చేసాడు దర్శకుడు నాగ్ అశ్విన్. స్క్రాచ్ నుండి రెండో భాగం అంటూ ఓ వీడియో విడుదల చేయగా అది వైరల్ గా మారింది. రైడర్స్ లుక్ ఎలా ఉండాలి అనే మేకింగ్ వీడియో ఆసక్తికరంగా సాగింది.
రోబో సినిమాలోలాగే విలన్ ఆర్మీకి సెపరేట్ సూట్ ఎలా ఉండాలి అనే దాని మీద చిన్న డిస్కషన్ అలాగే ఆ తతంగమంతా వీడియో తీసి ఆసక్తికరంగా మలిచి ఓ వీడీయో రూపంలో విడుదల చేసారు. అప్పట్లో వీల్ గురించి కూడా ఓ వీడియో చేసి వదిలారు. కట్ చేస్తే ఇప్పుడు విలన్ ఆర్మీ కోసం ఓ వీడియో అన్నమాట.
మొత్తానికి ఇలా వీడియోలతో నాగ్ అశ్విన్ తన సినిమా ట్రెండింగ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ – స్వప్న లు ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ చేస్తున్న సినిమా ఈ ప్రాజెక్ట్ – కె. దీనిపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.






