
యంగ్ హీరో అడవి శేష్ సుప్రియతో లవ్ లో ఉన్నాడా ? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. గతకొంత కాలంగా ఈ ఇద్దరి మధ్య పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ ఊహాగానాలను మరింతగా బలపరిచేలా క్రిస్మస్ వేడుకల ఫోటో వైరల్ అవుతోంది. అక్కినేని కుటుంబం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది ఇటీవలే. ఆ వేడుకలలో అక్కినేని కుటుంబం పాల్గొంది….. ఇక అదే వేడుకలో అడవి శేష్ కూడా పాల్గొన్నాడు ……. సుప్రియతో జంటగా.
దాంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనేది నిజమే అనిపిస్తోంది. అడవి శేష్ – సుప్రియ పక్క పక్కనే ఉండటంతో ఆ ఫోటో మరింత వైరల్ గా మారింది. అడవి శేష్ తనని తాను హీరోగా మలుచుకున్న విధానానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఎలాంటి అండదండా లేకుండా హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు.
ఇక సుప్రియ విషయానికి వస్తే ……. అక్కినేని నాగేశ్వర్ రావు మనవరాలిగా , నాగార్జున మేన కోడలుగా , చిత్ర రంగప్రవేశం చేసింది సుప్రియ. హీరోయిన్ గా పవన్ కళ్యాణ్ సరసన ” అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ” అనే చిత్రంతో పరిచయమైంది. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. దాంతో సుప్రియకు హీరోయిన్ గా అవకాశాలు దక్కలేదు. అందుకే సినిమాలలో నటించడం మానేసి అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసుకుంటోంది.