34.7 C
India
Friday, April 10, 2026
More

    ‘ఆదిపురుష్’ అప్డేట్ అయ్యాడా?

    Date:

    Is 'Adipurush' updated
    Is ‘Adipurush’ updated

    ప్రభాస్ , కృతి సనన్ జంటగా ‘ఆదిపురుష్’ యానిమేషన్ సినిమా టీజర్ ఆ మధ్య ఎప్పుడో విడుదలైంది. టీజర్ రిలీజ్ తర్వాత ఏ ఇండియన్ సినిమాకి రానంతగా ట్రోల్స్ వచ్చాయి. విజువల్స్ నాసిరంగా ఉన్నాయని ఎన్నెన్నో కామెంట్స్ పెడుతూ ట్రోల్ చేశారు అప్పట్లో. ఆ టీజర్ రిలీజ్ ఫంక్షన్ తరువాత ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ ని ‘కం టు మై రూమ్’ అనే మాట బాగా వైరల్ అయింది. దీంతో విజువల్ పై నెగిటివ్ కామెంట్స్ రావడంతో స్పెషల్ ఎఫెక్ట్స్ ను మరింత మెరుగ్గా చేస్తామని మేకర్స్ హామీ ఇచ్చారు. తాజాగా ఆ హామీని నిలబెట్టుకున్నట్లు తెలుస్తోంది.

    ఆదిపురుష్ మూవీకి సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేసిన దగ్గర్నుంచి ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. రాముడిగా ప్రభాస్ లుక్స్ ఆశించిన స్థాయిలో గొప్పగా లేవని, రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ అసలు సూట్ అవ్వలేదని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. హై ఎండ్ టెక్నాలజీని ఉపయోగించినా..సినిమా టీజర్ మాత్రం ఏదో కార్టూన్ సినిమా చూసినట్లు అనిపించిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు. అయితే తాజాగా బయటకు వచ్చిన ప్రోమోలో మార్పులు జరిగినట్లు స్పష్టంగా తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ..ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.

    ఆదిపురుష్ మూవీ న్యూయార్క్ లో జరిగే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో వరల్డ్ ప్రీమియర్ కోసం ఎంపికైంది. జూన్ 13న ఈ చిత్రాన్ని అక్కడ ప్రదర్శించబోతున్నారు. ట్రైబెకా ఫెస్టివల్ లో 36 దేశాల నుంచి ఎంపిక చేసిన చిత్రాలను ప్రదర్శిస్తున్నామంటూ నిర్వాహకులు ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆదిపురుష్ సినిమాలోని చిన్నక్లిప్ కూడా ఉంది. దీన్ని గమనిస్తే వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ లో మార్పులు చేసినట్లు స్పష్టం అవుతోంది. మొత్తానికి అప్డేట్ చేసిన ఈ కొత్త టీజర్ పాత దాని మీద కొంచెం బెటర్ క్వాలిటీ గా ఉందని చర్చించుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథ ఎందుకు సినిమాగా చేయలేకపోయింది?

    Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్‌కి ఉన్న గుర్తింపు మరే...

    Prabhas : హైదరాబాద్ వ్యాపారవేత్త కుమార్తెను వివాహం చేసుకోబోతున్న ప్రభాస్

    Prabhas Marriage : 45 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రభాస్ టాలీవుడ్‌లో మోస్ట్...

    Prabhas : వేల సంబంధాలు వచ్చినా ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం?

    Prabhas : ప్రభాస్ పెళ్లి గురించి ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన వార్త...

    Prabhas : ఈ ఊరు పేరు ‘ప్రభాస్’

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై ఓ ఊరుందనే విషయం...