టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో పాన్ ఇండియా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రూపొందనున్న ఆ చిత్రం ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా ? అని ఆశగా ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు తండ్రిగా లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇంకా ఈ విషయాన్ని ఆ చిత్ర బృందం ఖరారు చేయలేదు కానీ హీరో తండ్రి పాత్ర కూడా కీలకంగా ఉండనుందట. దాంతో ఆ పాత్రలో అమితాబ్ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. ఇక రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా అమితాబ్ వైపే మొగ్గు చూపుతున్నాడట. అయితే డిసైడ్ చేసేది మాత్రం ఎస్ ఎస్ రాజమౌళి అనే విషయం తెలిసిందే.
అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందట. మహేష్ బాబు టాలీవుడ్ హీరో అయినప్పటికీ హాలీవుడ్ హీరోలా ఉంటాడనే విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లకు మహేష్ ను హాలీవుడ్ హీరోలా చూపించే దర్శకుడు దొరికాడు కాబట్టి ఈ సినిమా వేరే లెవల్ లో ఉండటం ఖాయమని భావిస్తున్నారు అభిమానులు.