33.5 C
India
Friday, April 26, 2024
More

    దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయనున్నాడా ?

    Date:

    is dil raju plans to enter politics 
    is dil raju plans to enter politics

    అగ్ర నిర్మాత దిల్ రాజు రాజకీయాల్లోకి రానున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఒకవైపు గులాబీ పార్టీ దిల్ రాజును తమ పార్టీ తరుపున పోటీ చేయించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా దిల్ రాజు చేత పోటీ చేయించాలనే ఆలోచన చేస్తోందట.

    ఈ ఊహాగానాలకు మరింత బీజం పడింది రేవంత్ రెడ్డి పర్యటనతో. ఇటీవల రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించాడు. కాగా ఆ సమయంలో అగ్ర నిర్మాత దిల్ రాజు రేవంత్ రెడ్డిని తన స్వగ్రామమమైన నర్సింగ్ పల్లికి ఆహ్వానించడమే ! రేవంత్ రెడ్డిని తాను నిర్మించిన వెంకటేశ్వర స్వామి గుడికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేయించాడు.

    దాంతో ఈ ఊహాగానాలు ఎక్కువయ్యాయి. దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తాడా ? లేక గులాబీ పార్టీ తరుపున పోటీ చేస్తాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే దిల్ రాజు మాత్రం అటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇటు గులాబీ పార్టీ నాయకులతో సన్నిహితంగానే ఉంటున్నాడు. ఎన్నికల నాటికి మాత్రం ఏదోఒక పార్టీ తరుపున పోటీ చేయడం ఖాయమని భావిస్తున్నారు. టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందిన దిల్ రాజుకు రాజకీయాల్లో కూడా రాణించాలనే ఆసక్తి ఉంది.

    Share post:

    More like this
    Related

    YS Jagan : వైఎస్ జగన్.. మరో జైత్రయాత్ర

    YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట...

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్.. ఏవియన్ ఫ్లూ

    Avian flu : కోళ్లలో కొత్త రకం వైరస్ వస్తోంది. జంతువులు,...

    Jagan Strength : జగన్ బలం ఇక అదేనా..జనాలు ఏమనుకుంటున్నారంటే..

    Jagan Strength : ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు...

    YCP : వైసీపీ లోకి జనసేన నుండి భారీ చేరికలు

    YCP Vs Janasena YCP VS Janasena : సీఎం జగన్ పాలన చూసి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    LokSabha Elections 2024 : తొలి విడత పోలింగ్.. పలు రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు

    LokSabha Elections 2024 : తొలి విడత జరుగుతున్న రాష్ట్రాల్లో కొన్ని...

    Revanth Reddy : తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డితో అవుతుందా?

    CM Revanth Reddy : కాంగ్రెస్ ముందు మరో సవాలు ఎదురవుతోంది....

    KTR : బీజేపీలోకి రేవంత్ రెడ్డి: కేటీఆర్

    KTR Vs Revanth : ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై...