
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం ” ప్రాజెక్ట్ – K ”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రలో లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడానికి దుల్కర్ సల్మాన్ సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది.
హీరో దుల్కర్ సల్మాన్ అంటే వైజయంతి మూవీస్ ఆస్థానం హీరో అనే విషయం తెలిసిందే. మహానటి అనే క్లాసిక్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అలాగే గత ఏడాది సీతారామం చిత్రంలో నటించాడు దుల్కర్. ఈ సినిమాను కూడా నిర్మించింది వైజయంతి మూవీస్ కావడం విశేషం. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఇక అప్పటి నుండి దుల్కర్ అంటే చాలు వైజయంతి మూవీస్ ఆస్థాన హీరో అనే ముద్ర పడింది. దానికి మరింత ఊతమిచ్చేలా తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ – K చిత్రంలో కూడా దుల్కర్ నటించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ప్రాజెక్ట్ – కె చిత్రంలో దుల్కర్ సల్మాన్ పాత్ర హైలెట్ గా ఉండనుందని సమాచారం. చిన్న పాత్రే అయినప్పటికీ సినిమాలో కీలకమైన పాత్ర కావడంతో దుల్కర్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇక వైజయంతి మూవీస్ , నాగ్ అశ్విన్ దర్శకుడు అంటే మరో మాట లేకుండా ఎస్ చెప్పడమే దుల్కర్ చేసే పని దాంతో ప్రభాస్ ప్రాజెక్ట్ – కె చిత్రంలో దుల్కర్ భాగస్వామి కావడం ఖాయమే ! కాకపోతే అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది.