మహాశివరాత్రి రోజున ఆ పరమ శివుడిలో ఐక్యమయ్యాడు నందమూరి తారకరత్న. పట్టుమని 40 ఏళ్ళు కూడా పూర్తి కాకుండానే తారకరత్న మరణించడంతో నందమూరి అభిమానుల్లో మాత్రమే కాకుండా ప్రజల్లో కూడా విపరీతమైన సానుభూతి వ్యక్తమైంది. ఇక కొంతమంది జ్యోతిష్యులు తారకరత్న మళ్ళీ జన్మించడం ఖాయమని అంటున్నారు.
పరమ శివుడి పుట్టినరోజు అయిన మహాశివరాత్రి రోజునే మరణించాడు కాబట్టి తప్పకుండా పునర్జన్మ ఉంటుందని బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. శివరాత్రి రోజునే శివయ్యలో ఏకమయ్యాడు కాబట్టి తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహంతో తారకరత్న మళ్ళీ జన్మించడం ఖాయమని, ఇప్పుడు దక్కని విజయాలు అప్పుడు అందుకోవడం ఖాయమని అంటున్నారు.
కొంతమంది పునర్జన్మలను నమ్ముతుంటారు……. అయితే మరికొందరు మాత్రం ఆ పునర్జన్మలను నమ్మరు. ఎవరి నమ్మకం వాళ్ళది కానీ తారకరత్న మళ్ళీ జన్మిస్తాడు అనే విషయం జ్యోతిష్యులు చెబుతుండటంతో నందమూరి అభిమానులు ముఖ్యంగా తారకరత్న అభిమానులు మాత్రం సంతోషించడం ఖాయం. 23 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహాశివరాత్రి రోజునే తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. రేపే తారకరత్న పెద్ద కర్మ ….. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మళ్ళీ తారకరత్న జన్మించడం ఖాయం అంటూ జ్యోతిష్యులు చెబుతుండటంతో తారకరత్న అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.