పుష్ప చిత్రంలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఊ అంటావా మావా ఊఊ అంటావా అనే పాట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట యావత్ దేశాన్నే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కూడా మారుమ్రోగింది. అంతటి సంచలనం సృష్టించింది కాబట్టే పుష్ప 2 లో కూడా సమంత చేత ఐటెం సాంగ్ చేయించాలని అనుకున్నారట మేకర్స్. అయితే దర్శకుడు సుకుమార్ సమంత ను సీక్వెల్ లో కూడా ఐటెం సాంగ్ చేయాలని కోరాడని అందుకు సమంత నిరాకరించినట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ వార్త నిజం కాదని తెలుస్తోంది.
ఎందుకంటే సమంత టీమ్ ను ఈ విషయం పై ప్రశ్నించగా పుష్ప 2 టీమ్ ఎవరు కూడా మళ్లీ పార్ట్ 2 లో ఐటెం సాంగ్ చేస్తారా ? అని సమంతను సంప్రదించలేదని …… అలాంటప్పుడు రిజెక్ట్ చేశారు అనడం సరికాదని అంటున్నారు. అంటే పుష్ప 2 లో ఐటెం సాంగ్ ఉంటుంది అన్నది నిజం కాకపోతే సమంత స్థానంలో మరొక హీరోయిన్ చేత ఐటెం సాంగ్ చేయిసారన్న మాట.
సమంత ప్రస్తుతం సెటా డెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. అలాగే ఖుషి అనే సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. శాకుంతలం చిత్రం ఏప్రిల్ లో విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమాపై సమంత చాలా ఆశలే పెట్టుకుంది.