
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుండి మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలపై అలాగే చిత్ర నిర్మాతలైన యలమంచిలి రవిశంకర్ , నవీన్ యర్నేని లతో పాటుగా సీఈఓ చెర్రీ ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడులు చేసారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
గత ఏడాది మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప , సర్కారు వారి పాట చిత్రాలు పెద్ద హిట్ అంటూ బాక్సాఫీస్ ను కుమ్మేశాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మీడియాలో వచ్చిన లెక్కలకు మైత్రి మూవీ మేకర్స్ చూపించిన లెక్కలకు చాలా తేడాలు ఉండటంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన రెండు భారీ చిత్రాలు బాలయ్య వీర సింహా రెడ్డి , చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా 2023 సంక్రాంతికి విడుదల కానున్నాయి.