
Kriti Shetty : కృతి శెట్టి.. ఉప్పెన సినిమాతో తెలుగులో ఉప్పెన సృష్టించిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిరమైన స్థానం ఏర్పరుచుకుంది. ఈ సినిమాలో ఈమె నటన, హావభావాలు అన్ని కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.. దీంతో వరుస ఆఫర్స్ వరించాయి.. వరుసగా సూపర్ హిట్స్ నే అందుకుంటూ యంగ్ హీరోలకు మంచి ఛాయిస్ గా నిలిచింది.
అయితే ఈ మధ్య ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి.. దీంతో ఈమె కెరీర్ కాస్త జోరు తగ్గింది అనే చెప్పాలి.. మొదట్లో ఈమె హిట్స్ చూసి స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అంతా అనుకుంటే ఈమె మాత్రం ఇప్పుడు వరుస ప్లాప్స్ తో ఢీలా పడిపోయింది.
తాజాగా నాగ చైతన్యతో చేసిన కస్టడీ సినిమా కూడా అమ్మడి అంచనాలను నిలబెట్టలేక పోయింది. ఇది కూడా ప్లాప్ అయ్యింది. దీంతో ఈమెకు ఇప్పుడు మరో ఆఫర్ కూడా లేదు.. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో కృతి శెట్టి అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ఈమె కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయం మీద కూడా స్పందించింది..
ఈమె తనకు కాబోయే వరుడి ఎలా ఉండాలో చెబుతూ.. ”నాకు కాబోయే భర్త బొద్దుగా ఉండాలి.. అలాగే సింపుల్ గా డౌన్ టు ఎర్త్ లా ఉండాలి.. నాకు హంగామా చేసే వారంటే అస్సలు ఇష్టం లేదు.. అలాంటి వ్యక్తి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా” అంటూ ఈమె చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ విన్న నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.. ఆకతాయిలు కొంత మంది నాలో అన్ని లక్షణాలు ఉన్నాయి నన్ను పెళ్లి చేసుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.