నటీనటులు : అల్లరి నరేష్ , ఆనంది , వెన్నెల కిషోర్
సంగీతం : సాయిచరణ్ పాకాల
నిర్మాత : రాజేష్ దండు
దర్శకత్వం : ఏ ఆర్ మోహన్
విడుదల తేదీ : 25 నవంబర్ 2023
రేటింగ్ : 3/5
అల్లరి నరేష్ హీరోగా ఏ ఆర్ మోహన్ దర్శకత్వంలో రాజేష్ దండు నిర్మించిన చిత్రం ” ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ”. నవంబర్ 25 న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ :
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గ్రామం ” మారేడుమిల్లి ”. ఆ ఊళ్ళో ఆసుపత్రి కానీ బడి కానీ లేదు. దాంతో ఆ గ్రామంలోని ప్రజలు ఓట్లు వేయకుండా తమ నిరసన వ్యక్తం చేస్తుంటారు. అలాంటి చోటుకు ఎలక్షన్ డ్యూటీ మీద వస్తాడు శ్రీపాద శ్రీనివాస్ ( అల్లరి నరేష్ ) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అయితే మారేడుమిల్లి ప్రజానీకం మాత్రం ఓట్లు వేయడానికి నిరాకరిస్తారు. దాంతో ఆ గ్రామానికి చెందిన లక్ష్మీ ( ఆనంది ) సహాయంతో ప్రజలను ఓటేసేలా చేస్తాడు. మొదటిసారిగా మారేడుమిల్లిలో ఓట్లు పడటంతో పోలింగ్ సిబ్బందిని కిడ్నాప్ చేస్తుంది తండాకు చెందిన బ్యాచ్. దాంతో వాళ్ళను విడిపించడానికి ఏం చేసారు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
హైలెట్స్ :
అల్లరి నరేష్
కామెడీ
విజువల్స్
నేపథ్య సంగీతం
డ్రా బ్యాక్స్ :
రొటీన్ కథ
నటీనటుల ప్రతిభ :
శ్రీపాద శ్రీనివాస్ పాత్రలో అల్లరి నరేష్ ఒదిగిపోయాడు. ఒకప్పుడు అల్లరి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ ఇటీవల కాలంలో సీరియస్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అదే కోవలో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రాన్ని చేసి మరోసారి మెప్పించాడు. ఇక వెన్నెల కిషోర్ , ప్రవీణ్ , రఘుబాబు లు కామెడీతో అలరించారు. ఆనంది పక్కా పల్లెటూరు అమ్మాయిగా నటించి తన ప్రత్యేకత చాటుకుంది.
సాంకేతిక వర్గం :
గ్రామీణ వాతావరణంలో రూపొందిన చిత్రం కావడంతో విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. చోటా కె ప్రసాద్ అద్భుతమైన విజువల్స్ అందించాడు. శ్రీచరణ్ పాకాల అందించిన పాటలు బాగున్నాయి అయితే నేపథ్య సంగీతం మరింతగా సినిమాను ఎలివేట్ అయ్యేలా చేసింది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక దర్శకుడు ఏ ఆర్ మోహన్ ఈ చిత్రాన్ని మంచి సందేశంతో ఆకట్టుకునేలా రూపొందించాడు.
ఓవరాల్ గా :
మారేడుమిల్లి ప్రజానీకం తప్పకుండా చూడాల్సిన సినిమా.