30.1 C
India
Sunday, April 19, 2026
More

    జబర్దస్త్, ఢీ జోడీ పేమెంట్స్ ఎంతో తెలుసా.. అసలెందుకు తేడా..!

    Date:

    TV Shows Payments
    TV Shows Payments

    ఢీ జోడీ కొరియోగ్రాఫర్ చైతన్య మరణంతో ఇప్పుడు చర్చ అంతా జోడీ వర్సెస్ జబర్దస్త్ గా మారింది. ఢీ జోడీలో నిర్మాణ సంస్థ తగినన్ని డబ్బులు ఇవ్వకపోవడంతో కొరియోగ్రాఫర్ అప్పుడు తెచ్చి మరీ డ్యాన్సర్లకు ఇస్తున్నారని, దీంతో వారు అప్పులపాలై చివరికి చనిపోతున్నారని చైతన్యకు వచ్చిన పరిస్థితి మరే కొరియోగ్రాఫర్ కు రావద్దని జబర్దస్త్ టీం సభ్యులతో పాటు ఢీ జోడీ డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లు కూడా అంటున్నారు.

    జబర్దస్త్ లో చేసే టీమ్ లీడర్స్ తో పాటు సపోర్ట్ గా చేసే కమెడియన్స్ కూడా ఇప్పుడు బాగా సెటిల్ అయ్యారు. రాకెట్ రాఘవ, అధిరే అభి, ఇలా చాలా మంది హోం టూర్ లను కూడా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. వీరందరూ సరిపోయినంత రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు కో స్టార్లకు పెద్దగా ఖర్చు కాదు. దీంతో వారంతా ఆర్థికంగా ఫిట్ గా ఉంటున్నారు. కానీ ఢీ పరిస్థితి అలా కాదు. ఒక కొరియోగ్రాఫర్ తన డ్యాన్స్ సక్సెస్ కావాలంటే అంతలా కష్టపడే డ్యాన్సర్లను వెతుక్కోవాలి. వారి రూమ్ రెంట్లు, ఫుడ్, రెమ్యునరేషన్ ఇలా చాలా ఉంటాయి. ఒక్క సాంగ్ కు డ్యాన్స్ కంపోజ్ కావాలంటే రోజుల తరబడి ఉంటుంది. దీంతో మరింత ఆర్థిక ఉచ్చులో కూరుకుపోతున్నారు కొరియోగ్రాఫర్.

    జబర్దస్త్ లాంటి షో మొదలైనప్పటి నుంచి వెండితెరపై అవకాశాలు లేని వారు కూడా బుల్లితెరవైపునకు చూస్తున్నారు. ఈ కామెడీ షోను చూసి స్టార్, జీ లాంటి ఛానళ్లు కూడా నిర్వహిస్తున్నారు. ఎంత నవ్విస్తే అంత రెమ్యునరేషన్. అయితే ఢీ షోకు అంత రెమ్యునరేషన్ ఇవ్వకపోవడంతో రెండు షోలను ఒకే ఛానల్ నిర్వహిస్తున్నప్పుడు ఈ హెచ్చుతగ్గులు ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

    ఇక జబర్దస్త్ లోకి ఒక్కసారి ఎంటర్ అయితే వారి జాతకం మారుతుందని చాలా మంది అందులో చేసేందుకు ఆరాటపడుతుంటారు. అయితే జబర్దస్త్ స్ట్రాటింగ్ లో చాలా రేటింగ్స్ ను సంపాదించి పెట్టింది. మిగతా ఛానళ్లలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు వస్తుండడంతో క్రమ క్రమంగా తగ్గింది. దీనికి తోడు గతంలో ఉన్న కమెడీయన్స్ లేకపోవడంతో కూడా రేటింగ్స్ తగ్గుకుంటూ వస్తున్నాయి.

    అదిరే అభి ఏమన్నాడంటే..

    అయితే గతంలో అధిరే అభి జబర్దస్త్ గురించి కొన్ని వివరాలు చెప్పాడు. ఆ షోలో చేస్తున్న వారి Payments కూడా వివరించారు. దీనిలో భాగంగా ఒక్క షో చేస్తే రూ. లక్ష వరకూ వస్తుంది. ఈ లెక్కన నాలుగు వారాలు ఉంటుంది కాబట్టి రూ. 4లక్షల వరకూ పారితోషికం తీసుకుంటారు. ఇక ట్యాక్సులు, ఖర్చులు లాంటివి మినహాయించినా సంవత్సరానికి దాదాపు రూ. 30 లక్షల వరకూ మిగులుతుంది. అయితే ఈ డబ్బులతో బంగ్లాలు, కార్లు ఎవరూ కొనలేదని, వారి వారి టాలెంట్ ను బట్టి షోలు, ఈవెంట్లు చేస్తూ బయట కూడా ఆర్జిస్తున్నారని చెప్పాడు.

    అయితే జబర్దస్త్ కు, ఢీ జోడీకి తేడా అయితే ఉంటుంది. జబర్దస్త్ లో టీం టీడర్ తో సహా ఐదుగురికి మించకుండా  కంటెస్టెంట్లు మాత్రమే ఉంటారు. ఖర్చు కూడా తక్కువ. ఢీ జోడీ అలా కాదు. ఒక కొరియోగ్రాఫర్ కింద ఇద్దరు ఉంటారు. వారి కింద 20 మంది వరకూ డ్యాన్సర్లు ఉంటారు. వీరు సొంతంగా రానుపోను ఖర్చులు పెట్టుకున్నా. తిండి, తదితరాలు ఎక్కువే అవుతుంది. అందుకే సొంత ఖర్చులు పెట్టుకోవలసి వస్తుంది అన్నాడు అధిరే అభి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bandla Ganesh : ‘జబర్ధస్త్ పిలుస్తోంది రా.. కదలిరా’: నటి ఓటమిపై బండ్లన్న సెటైర్లు

    Bandla Ganesh : నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సినీ నటి...

    KCR Film : కేసీఆర్ సినిమా కోసం ఇల్లు కూడా తాకట్టు పెట్టాను.. జబర్దస్త్ టీం లీడర్ ఆవేదన..

    KCR Film : మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన జబర్దస్త్...