jabardasth varsha తెలుగులో ఫేమస్ అయిన రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి.. తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికే 6 సీజన్స్ ను పూర్తి చేసుకుంది. అయితే 6వ సీజన్ అట్టర్ ప్లాప్ అవ్వడంతో కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు 7వ సీజన్ ను స్టార్ట్ చేసారు.. ఇది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని బిగ్ బాస్ లవర్స్ ఎదురు చూస్తున్నారు..
ఈ క్రమంలోనే బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ ఇటీవలే సీజన్ 7 ప్రోమో రిలీజ్ చేసారు. ఇక బిగ్ బాస్ ప్రోమో రావడంతో అతి త్వరలోనే 7వ సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో బిగ్ బాస్ లవర్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే హోస్ట్ గా నాగార్జున అయితే ఫిక్స్ అయ్యాడు.
మరి త్వరలో స్టార్ట్ కాబోతున్న ఈ సీజన్ లో ఎవరెవరు పాల్గొంటారు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో బాగా పెరిగింది.. ఎవ్వరూ ఊహించని విధంగా ఈసారి కంటెస్టెంట్స్ రాబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది. ఒక్కొక్క పేరు బయటకు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరో హాట్ బ్యూటీ పేరు వినిపిస్తుంది.. ఇటీవలే వర్ష చేసిన కామెంట్స్ తో ఈమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనే టాక్ వస్తుంది.
సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నాయి కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగుతున్నారని అలా చేసే ఉద్దేశం లేదని తెలిపింది. అయితే త్వరలోనే పెద్ద షోలో కనిపిస్తానని తనకు సంబందించిన వివరాలు మొత్తం అదే షోలో చెబుతాను అని చెప్పుకొచ్చింది. దీంతో ఈమె బిగ్ బాస్ లోకే రాబోతుంది అని టాక్ గట్టిగ వినిపిస్తుంది. ఎప్పుడు జబర్దస్త్ నుండి ఒకరిని తీసుకుంటారు. ఈ సీజన్ లో ఈ అమ్మడు బెర్త్ కన్ఫర్మ్ అయినట్టే అని టాక్.. చూడాలి ఈ బ్యూటీ నిజంగానే ఉంటే ఎలా ఆకట్టు కుంటుందో..