36.5 C
India
Friday, April 10, 2026
More

    పుష్ప 2 లో జగపతిబాబు.. !

    Date:

     

    Jagapathi Babu in Pushpa 2
    Jagapathi Babu in Pushpa 2

    మైత్రి మూవీస్ సంస్థపైనే కాకుండా డైరెక్టర్ సుకుమార్ ఆఫీస్ పై ఐటీ శాఖ దాడులు చేయడంతో పుష్ప2 షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ చాలా డీలా పడ్డారు. సినిమా షూటింగ్ ఉంటుందా లేదా.. ఉంటే మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారు…అనుకున్న టైమ్ కు పుష్ప2 వస్తుందా రాదా…ఇలా ఎన్నో అనుమానాలు వెంటాడాయి. అయితే త్వరలో పుష్ప2 షూటింగ్ లో పాల్గొంటున్నానంటూ జగపతిబాబు ప్రకటించడంతో ఫ్యాన్స్ అనుమానాలు అన్నీ పటాపంచలు అయ్యాయి.

    ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన వేర్ ఈజ్ పుష్ప అనే స్పెషల్ వీడియో పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. పుష్ప2 కోసం టోటల్ ఇండియా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. పుష్ప2 వీడియోకి దక్కిన రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ అందుకు నిదర్శనం.పుష్ప2 పై ఆడియెన్స్ క్రేజ్ ని పక్కనపెడితే ఈ ప్రాజెక్ట్ లోకి ఇప్పుడు జగపతిబాబు కూడా ఎంట్రీ ఇచ్చాడు. సుకుమార్ తీసిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల్లో జగపతిబాబు పాత్రలకు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో ఈ సినిమాలో అంతకు మించి అనేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఆయనది పాజిటివ్ రోలా లేదా నెగిటివ్ రోలా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.

    పుష్ప 1 లోనే సునీల్, ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్ కాస్ట్ ఉన్నారు. ఇప్పుడు పార్ట్ 2లో జగపతి బాబు కు యాడ్ అయ్యాడు. అయితే రంగస్థలంలో జగ్గూభాయ్ సర్పంచ్ ఫణింద్ర భూపితిగా నటించాడు. క్లైమాక్స్ లో రామ్ చరణ్.. చావకొట్టినట్లు చూపించారు కానీ చివరకు ఏమయ్యాడన్ని మాత్రం రివీల్ చేయలేదు. దీంతో లెక్కల మాస్టర్ పుష్ప 2 లో ఆ సర్పంచ్ పాత్ర నే చేయిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాక పార్ట్ 3 కూడా ఉండనుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక జ‌గ‌ప‌తిబాబు ఎంట్రీతో పుష్ప 2 మ‌రో లెవ‌ల్ కు వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. చిన్న వీడియోతోనే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పుష్పరాజ్ రానున్న రోజుల్లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : ఇదేమి ట్విస్ట్ : ‘పుష్ప 2’ మొత్తం మాయేనా..? సంచలనం రేపుతున్న వీడియో!

    Pushpa 2 : పుష్ప 2' సినిమాకు సంబంధించిన తాజాగా విడుదలైన VFX...

    Ram Charan : ముదిరిన వివాదం.. ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని ‘Unfollow’ కొట్టిన రామ్ చరణ్

    Ram Charan : మెగా, అల్లు కుటుంబ అభిమానుల మధ్య గొడవలు తగ్గుతాయేమో...

    CM Revanth Reddy : అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టడానికి కారణం అదేనట!

    CM Revanth Reddy : అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి...

    Allu Arjun : అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్.. రెగ్యులర్ బెయిల్ మంజూరు

    Allu Arjun Bail : సినీ నటుడు అల్లు అర్జున్ కు...