
ఎక్కడ చూసినా జై బాలయ్య నినాదాలతో హోరెత్తిపోతోంది. అమెరికా , లండన్ , ఇండియా అనే తేడా లేకుండా ……. బార్ , రెస్టారెంట్ , హోటల్ , సినిమాహాలు , ఫంక్షన్ హాల్ అనే తేడాలేకుండా జై బాలయ్య నినాదాలతో మారుమ్రోగుతోంది. ఈ నినాదాలు చేస్తోంది కుర్రకారు కావడం విశేషం.
బాలయ్య వయసు 62 అయినప్పటికీ ఈ ఏజ్ లో మరింత క్రేజ్ పెరగడం విశేషం. ఏ ఫంక్షన్ జరిగినా , సినిమాహాల్లో ఉన్నా ….. మరో సినిమా ఫంక్షన్ అయినా సరే జై బాలయ్య అని అరవాల్సిందే. అలా తయారయ్యింది పరిస్థితి. ఇటీవల పలు సినిమా ఫంక్షన్ లలో జై బాలయ్య నినాదాలు ఇస్తుంటే ఆ హీరోలు కూడా జై బాలయ్య అంటూ నినాదాలు ఇవ్వాల్సి వచ్చింది.
అఖండ సినిమా తర్వాత బాలయ్య రేంజ్ మరింతగా పెరిగింది. ఇక ఇప్పుడేమో అన్ స్టాపబుల్ షోతో ఖండాంతరాలు దాటుతోంది. మొత్తానికి జై బాలయ్య నినాదంతో యువతలో సరికొత్త ఉత్సాహం వెల్లివిరుస్తోంది. తాజాగా బాలయ్య నటించిన 107 వ సినిమా టైటిల్ ఈరోజే సాయంత్రం కర్నూల్ లో ప్రకటించనున్నారు. ఆ సినిమా 2023 సంక్రాంతి బరిలో దిగనుంది.