తెలుగుతెరపై చెరగని ముద్ర వేసిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. తెలుగునాట తిరుగులేని మాస్ హీరో……. బంగారం లాంటి వ్యక్తిత్వం కలిగిన హీరో కాబట్టే ఆయన్ని అమితంగా అభిమానిస్తారు ఆయన అభిమానులు. కృష్ణ మరణం అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తింది. ఎల్లలు లేని అభిమానం కృష్ణ సొంతం. UBlood ఫౌండర్ , JSW & Jaiswaraajya అడ్వైజర్ జై యలమంచిలి కృష్ణ పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు.
మహేష్ బాబును కలిసి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. తాను అమెరికా నుండి హైదరాబాద్ వచ్చిన రోజునే తన అభిమాన హీరో కృష్ణ మరణించారని తెలిసి కుమిలిపోయారు జై యలమంచిలి. సూపర్ స్టార్ కృష్ణ అంటే జై యలమంచిలికి ఎనలేని అభిమానం. అంతేకాదు కృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు జై యలమంచిలి. దాంతో కృష్ణ భౌతిక కాయం చూసి విలపించారు. తన అభిమాన నటుడికి ఘన నివాళి అర్పించారు.