వినూత్న కార్యక్రమాలతో దూసుకుపోతోంది JaiswaraajyaTv యూట్యూబ్ ఛానల్. తాజాగా ఈ యూట్యూబ్ ఛానల్ 2 లక్షల subscribers ను అధిగమించింది. కేవలం ఆరు నెలల కాలంలోనే లక్షా ఎనభై వేల subscribers మనసు గెలుచుకుంది జైస్వరాజ్యటీవీ. అతి తక్కువ సమయంలో ఈ అరుదైన ఘనత సాధించడానికి సంస్థ అధినేత , UBlood app ఫౌండర్ డాక్టర్ జై యలమంచిలి అందించిన సహకారం కారణమని , అలాగే సిబ్బంది అంకితభావంతో పని చేయడమే ఇందుకు తార్కాణమన్నారు JSW& Jaiswaraajya.tv యూట్యూబ్ ఛానల్స్ , వెబ్ పేపర్స్ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్.
కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రేక్షకులను అలరించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నామని , అసభ్యతకు , అశ్లీలతకు తావు లేకుండా……. ఏ వర్గానికి కొమ్ము కాయకుండా నిజాయితీగా కార్యక్రమాలు చేస్తున్నామని , అలాగే మునుముందు మరిన్ని మంచి కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తామన్నారు డాక్టర్ శివకుమార్ ఆనంద్.