పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా రికార్డుల మోత మోగిస్తోంది. అదేంటి జల్సా ఎప్పుడో విడుదల అయ్యింది కదా ! మళ్ళీ రికార్డుల మోత మోగించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఈరోజు సెప్టెంబర్ 2 ……. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. దాంతో పవర్ స్టార్ అభిమానులు జల్సా చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ అయ్యేలా చేసారు. అభిమానుల డిమాండ్ మేరకు జల్సా చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 701 కేంద్రాల్లో భారీ ఎత్తున విడుదల చేసారు.
ఇక తమ అభిమాన కథానాయకుడి పుట్టినరోజు కావడంతో జల్సా ప్రదర్శిస్తున్న థియేటర్ ల వద్ద అభిమానుల పూనకాలతో దద్దరిల్లిపోతున్నాయి. జల్సా చిత్రంలో పాటలన్ని కూడా సూపర్ హిట్టే దాంతో కొన్ని పాటలను మళ్ళీ మళ్ళీ వేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు అభిమానులు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన జల్సా చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇలియానా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ , కమిలినీ ముఖర్జీ , అలీ తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక జల్సా చిత్రాన్ని 4 K రెసొల్యూషన్ లో విడుదల చేసారు.
Breaking News