
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 వ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ భామ ఈ సినిమా కోసం ఫుల్లుగా డిమాండ్ చేసిందట. మాములుగా అయితే ఒక్కో సినిమాకు 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోంది జాన్వీ . అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనగానే ఫుల్లుగా డిమాండ్ చేసింది. దాంతో తప్పక ఇవ్వాల్సి వచ్చిందట.
ఇంతకీ ఈ భామ ఎంత డిమాండ్ చేసిందో తెలుసా …….. 5 కోట్లు. 3 కోట్లు తీసుకునే భామ 5 కోట్లు డిమాండ్ చేసినప్పటికీ ఆ మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు సుముఖత వ్యక్తం చేశారట. దాంతో ఆ సొమ్ము ఇచ్చేసి జాన్వీ కపూర్ ను బుక్ చేసుకున్నారు. ఇటీవల జాన్వీ కపూర్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్బంగా జాన్వీ కపూర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ స్టిల్ వదిలారు మేకర్స్. జాన్వీ కపూర్ స్టిల్ కు మంచి స్పందన వచ్చింది.
ఈనెలలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే నెల నుండి జరుగనుంది. త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి 2024 ఏప్రిల్ 5 న సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యువ సుధా ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.