ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి మరో అరుదైన అవార్డు దక్కింది. జపాన్ అకాడమీ అవార్డు దక్కింది దాంతో మరోసారి ప్రపంచ నగర వీధుల్లో ఆర్ ఆర్ ఆర్ పేరు మారుమ్రోగుతోంది. 46 వ జపాన్ అకాడమీ ఫిలిం ప్రైజ్ కు సంబంధించి ” అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ ” విభాగంలో ఆర్ ఆర్ ఆర్ ఈ ఘనత సాధించింది. అవతార్ : ది వే ఆఫ్ వాటర్ ,టాప్ గన్ : మ్యావరిక్ వంటి హాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి మరీ ఆర్ ఆర్ ఆర్ ఈ అవార్డు సొంతం చేసుకోవడం సంచలనంగా మారింది.
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ గత ఏడాది విడుదలై ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీం గా నటించగా అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ నటించాడు. అల్లూరి గా చరణ్ మెప్పించగా కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆస్కార్ రేసులో కూడా ఉన్నాడు ఎన్టీఆర్. ఉత్తమ నటుడి అవార్డు సాధించడానికి అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు.