కూతుళ్ళ కోసం మా ఆస్తులు అమ్ముకున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది జీవిత. హీరో డాక్టర్ రాజశేఖర్ – జీవిత దంపతులకు శివాని , శివాత్మిక ఇద్దరు కూతుళ్లు అనే విషయం తెలిసిందే. అయితే ఇద్దరు కూడా హీరోయిన్ లయ్యారు. అయితే ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయారు. శివాత్మిక మొదట హీరోయిన్ గా పరిచయం అయ్యింది. దొరసాని చిత్రం శివాత్మికకు మంచి పేరు తెచ్చిపెట్టింది నటిగా. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
ఆ తర్వాత శివాత్మిక పలు చిత్రాల్లో నటించింది కానీ సక్సెస్ సాధించలేకపోయింది. తాజాగా పంచతంత్రం అనే సినిమాలో నటించింది శివాత్మిక. అలాగే పెద్ద అమ్మాయి శివాని నటించిన రెండు చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదల అయ్యాయి. ఇక శేఖర్ అనే సినిమా థియేటర్ లలో విడుదల అయ్యింది కానీ ఆ సినిమా వచ్చిన విషయం కూడా తెలియకుండానే వివాదంలో ఇరుక్కొని థియేటర్ ల నుండి అర్దాంతరంగా తీసెయ్యాల్సి వచ్చింది.
రాజశేఖర్ ఒకప్పుడు స్టార్ హీరో కావడంతో ఆయన నటించే సమయంలో రెగ్యులర్ గా లొకేషన్ కు వెళ్తుండేవాళ్లు శివాని , శివాత్మిక. దాంతో మేము కూడా సినిమాల్లోకి వస్తామని చెప్పడంతో చాలా బాధపడ్డారట. ఎందుకంటే ఆస్తులు అంటే సంపాదించి ఇవ్వొచ్చు కానీ సినిమాల్లో టాలెంట్ కంటే అదృష్టం ఎక్కువగా ఉండాలి. ఆ అదృష్టం ఉంటేనే సినిమాల్లో సక్సెస్ అవుతారు. లేదంటే షరామామూలే అందుకే చాలా బాధపడ్డారట. ఇక సొంత సినిమాలు చేసి ఆర్ధికంగా నష్టపోయారు దాంతో ఫిలిం నగర్ లో విలువైన ఆస్తిని అమ్ముకోవాల్సి వచ్చింది.