39.6 C
India
Saturday, April 20, 2024
More

    JR. NTR- AADI :ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శుభవార్త : రీ రిలీజ్ కానున్న ఆది

    Date:

    jr-ntr-aadi-good-news-for-ntr-fans-aadi-to-be-re-released
    jr-ntr-aadi-good-news-for-ntr-fans-aadi-to-be-re-released

    ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త …….. ఎన్టీఆర్ ను మాస్ హీరోగా ఊహించని సక్సెస్ ని ఇచ్చిన చిత్రం ” ఆది ”. కాగా ఆ చిత్రాన్ని నవంబర్ లో మళ్ళీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వివివినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది చిత్రం తెలుగు చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టింది. ఇక అప్పటి వరకు ఎన్టీఆర్ కు అంతగా ఇమేజ్ లేదు. స్టూడెంట్ నెం 1 చిత్రంతో సక్సెస్ అందుకున్నప్పటికీ స్టార్ డం మాత్రం అందుకోలేకపోయాడు.

    కట్ చేస్తే ఆది చిత్రంతోనే ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యాడు. తిరుగులేని విజయాన్ని అందుకున్న ఆది చిత్రంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా స్టార్ గా మారిపోయాడు. నందమూరి వంశానికి ఉన్న మాస్ ఇమేజ్ ఈ సినిమాతో అందుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇటీవల కాలంలో స్టార్ హీరోల చిత్రాలు మళ్ళీ మళ్ళీ విడుదల అవ్వడం కామన్ గా మారిపోయింది.

    ఇప్పటికే బాలయ్య చెన్నకేశవ రెడ్డి , మహేష్ బాబు పోకిరి , పవన్ కళ్యాణ్ జల్సా చిత్రాలు విడుదలై ప్రభంజనం సృష్టించాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఎన్టీఆర్ ఆది కూడా చేరనుంది. ఆది చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ , నల్లమలుపు బుజ్జి నిర్మించారు. వినాయక్ మొదటి చిత్రం కావడం విశేషం. ఇక ప్రస్తుతం 4 K పనులు జరుగుతున్నాయి. దాంతో నవంబర్ లో పెద్ద ఎత్తున ఆది రీ రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. 

    Share post:

    More like this
    Related

    Pakistan News : ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

    Pakistan News : పాకస్థాన్ లో అరుదైన సంఘటన జరిగింది. రావల్పిండికి...

    Minister Roja : మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా..?

    Minister Roja : నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా...

    Pooja Hegde : పూజ హెగ్డే పెళ్లి పీటలెక్కబోతుంది.. మరి అదృష్టవంతుడు ఏవరంటే?

    Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related