జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా ” శ్రీ శ్రీ రాజావారు ” అనే సినిమాలో హీరోగా నటించాడు. శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ వేగేశ్న ఈ సినిమాకు దర్శకుడు. టైటిల్ కూడా అనౌన్స్ చేసారు. గత ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండే ….. అయితే రష్ చూసుకున్న తర్వాత ఆశించిన స్థాయిలో సినిమా లేదని ఆ సినిమాను పక్కన పెట్టారట.
కట్ చేస్తే …… ఆగిపోయిన సినిమాను మళ్ళీ పట్టాలెక్కించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ నిర్మాత జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ అంటే అమితమైన ఇష్టం ఈ నిర్మాతకు. దాంతో తన హీరో బావమరిదిని హీరోగా నిలబెట్టడానికి కంకణం కట్టుకున్నాడట.
ఆగిపోయిన సినిమా కథ విని ……… కథ బాగుంది కాబట్టి కొన్ని మార్పులు చేసి మళ్ళీ తీద్దాం అని డిసైడ్ అయ్యాడట. దాంతో ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నే నితిన్ హీరోగా త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కడం ఖాయమని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణీత సోదరుడే ఈ నార్నే నితిన్. ఇతడికి సినిమాల మీద గాలి మళ్లిందట దాంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అయితే మొదటి సినిమా షూటింగ్ దెబ్బ కొట్టడంతో దానికి రిపేర్లు చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత నాగవంశీ.