
నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగుళూర్ లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్యం విషమించడంతో నందమూరి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దాంతో ఒక్కొక్కరుగా బెంగుళూర్ లోని నారాయణ హృదయాలయకు చేరుకుంటున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ అక్కడే ఉండగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి , నందమూరి సుహాసిని తదితరులు బెంగుళూర్ చేరుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా బెంగుళూర్ వెళ్తున్నాడు.
నందమూరి తారకరత్న కు జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడు అవుతాడనే విషయం తెలిసిందే. నందమూరి కుటుంబంలో స్వల్ప విబేధాలు ఉన్నప్పటికీ , ఇలాంటి సమయాల్లో అందరూ ఒక్కటి అవుతారు. నందమూరి కుటుంబం అంతా బెంగుళూర్ చేరుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా బెంగుళూర్ వెళ్తున్నాడు. నందమూరి తారకరత్న ఆరోగ్యం విషమించిందని , అతడ్ని కాపాడటానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు డాక్టర్లు. తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.