
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారకరామారావు మనవడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ ఆకారం ఏంటి ? ఈ బచ్చా ఎన్టీఆర్ మనవడా ? అంటూ హేళన చేశారు. కట్ చేస్తే స్టూడెంట్ నెం 1 చిత్రంతో సూపర్ హిట్ కొట్టి కొంతవరకు సమాధానం చెప్పాడు. అయితే అసలు సిసలైన బ్లాక్ బస్టర్ మాత్రం ఆది , సింహాద్రి చిత్రాలతో ఇండస్ట్రీని షేక్ చేసాడు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయని ప్రూవ్ చేసాడు.
ఇక రాజమౌళి సలహాతో తన ఆకారాన్ని మార్చుకొని యమదొంగ చిత్రంతో సర్ప్రైజ్ చేసాడు. ఇక అప్పటి నుండి రికార్డుల వేట మొదలు పెట్టి టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలలో ఒకరిగా రాణిస్తున్నాడు. తాతకు తగ్గ వారసుడిగా తండ్రిని మించిన తనయుడిగా బాబాయ్ కి తగ్గ అబ్బాయ్ గా సంచలనాలు సృష్టిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
ఇక ఇప్పుడేమో ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఆస్కార్ సాధించాడు. ఆస్కార్ అవార్డు నేరుగా ఎన్టీఆర్ కు రాకపోయినా ఎన్టీఆర్ నటించిన చిత్రానికి డ్యాన్స్ చేసిన పాటకు రావడంతో ఎన్టీఆర్ వరల్డ్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు 80 కోట్ల మేరకు పారితోషికం అందుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆస్థి ఇప్పటి వివరాల ప్రకారం ఎంతో తెలుసా ……. దాదాపుగా 600 కోట్లు. మొత్తంగా 571 కోట్ల నికర ఆస్తుల విలువ అని అంటున్నారు.