యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ఏంటి ? విలన్ గా నటించడం ఏంటి ? అని షాక్ అవుతున్నారా ? ఇది నిజమే ! కాకపోతే హీరో కూడా ఎన్టీఆరే !! . ఊర మాస్ దర్శకులు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాగా ఆ సినిమాలోనే ఎన్టీఆర్ హీరోగా అలాగే విలన్ గా ద్విపాత్రాభినయం పోషించనున్నట్లు సమాచారం.
నటనలో ఎన్టీఆర్ ని కొట్టేవాళ్లే లేరు. నెగెటివ్ క్యారెక్టర్ ను కూడా అద్భుతంగా పోషించి మెప్పించగల దిట్ట ఎన్టీఆర్. టెంపర్ చిత్రంలో నెగెటివ్ క్యారెక్టర్ ని అద్భుతంగా పోషించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు. అలాగే జైలవకుశ చిత్రంలో కూడా నెగెటివ్ క్యారెక్టర్ పోషించి శభాష్ అనిపించాడు.
దాంతో కాబోలు ఎన్టీఆర్ ను ఢీకొట్టే విలన్ అంటే ఎన్టీఆర్ మాత్రమే పోషిస్తే అద్భుతంగా ఉంటుందని భావించిన ప్రశాంత్ నీల్ ఇలా ప్లాన్ చేసాడట. ఇక ఎన్టీఆర్ కూడా విలన్ పాత్ర పోషించడానికి సై అన్నాడట. ఇదే కనుక నిజమైతే అభిమానులకు , ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.